ట్రెండింగ్ లో ప్రభాస్ స్ట‌న్నింగ్ యాక్షన్ పోస్టర్ !

Published on Jul 26, 2019 12:01 am IST

‘బాహుబలి చిత్రం తరువాత యంగ్‌ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సాహో. ఇటీవలే ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరింత హీట్ ను పెంచేసే విధంగా ఉన్న స్టన్నింగ్ యాక్షన్ ప్యాక్ డ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ స్టన్నింగ్ యాక్షన్ పోస్టర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతోంది.

ఈ పోస్టర్ తో సినిమా ఎంత స్టైలిష్ యాక్షన్ తో కూడుకున్నదో అర్థమవుతోంది. పోస్టర్ డిజైనింగ్ కూడా వరల్డ్ క్లాస్ క్వాలిటీని తలపించింది. దీంతో ఈ సినిమా క్వాలిటీ ఏ రేంజ్ లో ఉండనుందో అర్థమైంది. హీరోయిన్ శ్ర‌ధ్ధా క‌పూర్ సైతం ఈ పోస్టర్ లో ప్రభాస్ కి పర్ ఫెక్ట్ కాంబినేషన్ గా కనిపించింది. ఈ చిత్రం అగ‌ష్టు 30న భారీ అంచనాలతో అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ భారీ చిత్రానికి దర్శకుడు.

సంబంధిత సమాచారం :