టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుందని.. ఆమె ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ కూడా అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ, ప్రియాంక హైదరాబాద్‌లో కనిపించింది. దీంతో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, తాజాగా ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చేసేది హీరోయిన్ పాత్ర కాదని.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని.. ఆమెది విలన్ పాత్ర అని సినీ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో… ఇదెక్కడి ట్విస్ట్ మావా.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ అనుకున్న ప్రియాంక విలన్‌గా మారిందని.. జక్కన్న అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో.. అంటూ మహేష్ ఫ్యాన్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు.