‘షారుక్’ అతిథి పాత్రలో కన్ఫర్మే !

‘షారుక్’ అతిథి పాత్రలో కన్ఫర్మే !

Published on May 20, 2019 12:02 AM IST

 

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావులు హీరో హీరోయిన్లుగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘మెంటల్ హై క్యా’ అనే ఓ హిందీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. ఈ సినిమాలో ‘షారుక్’ అతిథి పాత్రలో కన్ఫర్మేనట. ఇక ఈ ‘మెంటల్ హై క్యా’ చిత్రాన్ని జూన్ 21వ తేదీన విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా ప్రకాష్ గత చిత్రం ‘సైజ్ జీరో’ కూడా బాగానే ఆడింది. మరి ఇప్పుడు రాబోతున్న ఈ హిందీ చిత్రం కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు