ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్ ?

ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్ ?

Published on Feb 8, 2026 7:00 AM IST

NTR-Neel

ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. ఆయన తీసిన కేజిఎఫ్, సలార్ ఇలాగే సాగాయి. కాబట్టి, ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ తోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. అన్నట్టు సినిమాలో ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని టాక్ నడుస్తోంది.

ఇక ఈ సినిమా వర్కింగ్ టైటిల్ డ్రాగన్. కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

తాజా వార్తలు