చరణ్, శంకర్ ల ప్రాజెక్ట్ కి బడ్జెట్ అంతా..?

Published on Jul 6, 2021 8:04 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి అనౌన్స్ కాబడిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై మళ్ళీ నిన్ననే ఒక అధికారిక క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ ని చరణ్ మరియు నిర్మాత దిల్ రాజు కూడా వెళ్లి కలిసి రావడం మంచి హాట్ టాపిక్ అయ్యింది. దీనితో వీరి సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్ అయ్యి సెప్టెంబర్ నుంచి షూట్ కి రెడీ అవుతుంది అని టాక్ వచ్చింది.

అయితే శంకర్, చరణ్ సహా నిర్మాత దిల్ రాజు లకు కూడా ఇది బెంచ్ మార్క్ సినిమా కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే శంకర్ తో సినిమా అంటే మినిమమ్ బడ్జెట్ పై ఒక అంచనా కూడా ఉంటుంది. మరి అలా ఈ సినిమాకి 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.

దిల్ రాజు బడ్జెట్ పరంగా ఎంత పర్టిక్యులర్ గా ఉంటారో తెలిసిందే.. అలాగే శంకర్ కూడా క్వాలిటీ పరంగా ఎక్కడా కంప్రమైజ్ కారు సో ఇలాంటి ఒక కాంబో నుంచి ఎలాంటి విజువల్ ట్రీట్ వస్తుందా అన్నది అంతకంతకు ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :