కొత్త హీరోయిన్‌కి భలే డిమాండ్

Published on Jun 13, 2019 9:56 pm IST

తెలుగు పరిశ్రమలోకి ఎవరైనా కొత్త హీరోయిన్ వస్తోందంటే అందరి చూపు ఆమె వైపే ఉంటుంది. ప్రేక్షకులను కనెక్ట్ చేసుకోగలిగితే ఆమె దశ తిరిగిపోతుంది. ప్రస్తుతం కొత్తమ్మాయి ప్రియాంక అరుల్ మోహన్ పరిస్థితి ఇలానే ఉంది. నాని చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో మంచి లాంచ్ పొందనున్న ఈమెకు ఇప్పటి నుండే ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట.

యువ హీరోలతో సినిమాలు చేయాలనుకునే దర్శక నిర్మాతలు ఆమె వైపే చూస్తున్నారు. నటిగా కన్నడలో మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈమె తెలుగు ప్రేక్షకుల్ని కూడా తప్పక అలరిస్తుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకి ముందే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో కథానాయకిగా ఆమెనే తీసుకోవాలని డిసైడయ్యారట ఆ చిత్ర దర్శకుడు. ఇప్పుడే ఇలా ఉంటే మొదటి సినిమాలో ప్రియాంక అరుల్ విశేషంగా మెప్పించగలిగితే ఆమెకు తెలుగు పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంటుందనడంలో సందేహమే లేదు.

సంబంధిత సమాచారం :

More