దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఆగస్టు సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే.. భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కానీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫస్ట్ షెడ్యూల్ అనంతరం జరగబోయే రెండో షెడ్యూల్ లో హీరో – హీరోయిన్ల పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది.
అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.


