లక్ష్య నుండి సరికొత్త పోస్టర్ విడుదల!

Published on Jul 30, 2021 1:37 pm IST


నాగ శౌర్య హీరో గా, కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం లక్ష్య. సంతోష్ జాగర్ల పుడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి సంబందించిన సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. నాగ శౌర్య మరియు కేతికా శర్మ లు కలిసి ఉన్న ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నారాయణ్ దాస్ నరంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ చిత్రానికి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. సృజనమాని చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. కాల భైరవ చిత్రం కి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :