మళ్లీ లావు పెరుగుతున్న ఎన్టీఆర్ !

Published on Dec 4, 2018 6:51 pm IST

జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ షూటింగ్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ముఖ్యంగా వెయిట్ పెరగనున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్, ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ ఆధ్వర్యంలో కఠినమైన బాడీ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నాడు. మొత్తం మీద ఎన్టీఆర్‌ ఈ సినిమాలో పూర్తి కండలు తిరిగిన దేహంతో కనిపిస్తుండగా రామ్ చరణ్ న్యూ హెయిర్ స్టైల్ తో కనిపించనున్నాడు.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత సమాచారం :