మోహన్ బాబు పాత్ర పై క్రేజీ న్యూస్ !

మోహన్ బాబు పాత్ర పై క్రేజీ న్యూస్ !

Published on Jul 20, 2026 7:00 AM IST

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని, తిరుపతి నేపథ్యంలో రస్టిక్ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే ఈ కథలో మోహన్ బాబు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మోహన్ బాబు కనిపిస్తారని, ముఖ్యంగా హీరోకి – మోహన్ బాబుకి మధ్య వచ్చే సీన్స్ లో సంఘర్షణ చాలా ఇంటెన్సివ్ గా ఉంటుందని తెలుస్తోంది.

పైగా ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి సినిమాలో ఎమోషనల్ డ్రామా కూడా చాలా బాగుంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమాతోనే తెలుగులోకి అరంగేట్రం చేయబోతుంది. చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు,

సంబంధిత సమాచారం

తాజా వార్తలు