‘ఎఫ్ 3’ హైలైట్ పాత్ర పై క్రేజీ అప్ డేట్ !

Published on Jul 12, 2021 7:03 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి చేస్తున్న ‘ఎఫ్ 3’ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో సునీల్ పిసినారి పాత్రలో కనిపించబోతున్నాడని, జంధ్యాల అహన పెళ్ళంట సినిమాలోని కోట పాత్రను కమటిన్యూ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో అనిల్ రావిపూడి ఈ పాత్రను రాశాడని తెలుస్తోంది. అయితే ఇదే పాత్రలో గతంలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సునీల్ పేరు వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఈ సినిమా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా. అయితే ఈ సీక్వెల్ లో కూడా త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించబోతున్నారు. వీళ్ళు వెంకీ వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని సమాచారం. ఇక ఈ జనరేషన్ లో కామెడీని హ్యాండిల్ చేయడంలో బెస్ట్ ఎవరు అనగానే ముందుగా అనిల్ రావిపూడి పేరే ముందువరుసలో ఉంటుంది. అంతగా అనిల్ టాలీవుడ్ లో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :