ఎన్టీఆర్ ‘దేవర-2’ విఎఫ్ఎక్స్ పనులు మొదలు !

ఎన్టీఆర్ ‘దేవర-2’ విఎఫ్ఎక్స్ పనులు మొదలు !

Published on Apr 27, 2025 6:05 PM IST

Devara1

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. రీసెంట్ గా జపాన్ లో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ దక్కింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, తాజాగా ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే, కొరటాల శివ స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో వర్క్ చేస్తారట. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు