‘సిటీమార్’ కూడా ఓటీటీలో కేనా ?

‘సిటీమార్’ కూడా ఓటీటీలో కేనా ?

Published on Aug 9, 2021 8:24 AM IST


గోపీచంద్‌ హీరోగా దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్ లో రానున్న ‘సిటీమార్’ కూడా ఓటీటీలో రాబోతోందా ? ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చిందా ? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో కొన్ని రోజుల్లో తెలియనుంది.

ఇక ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ తమన్నా అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారట. ఆ పాత్రలోనే వెన్నెల కిషోర్ నటిస్తున్నాడు. అలాగే వెన్నెల కిషోర్, సప్తగిరి లాంటి కమెడియన్స్ కూడా ఈ సినిమాలో అలరించనున్నారు.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ వెరీ ఇంట్రెస్ట్ గా ఉంటుందట. ఎలాగైనా గోపీచంద్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే పట్టుదలతో సినిమా చేశాడట సంపత్ నంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు