ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకలోని కుంటా సమీపంలో ఓ భారీ సెట్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సెట్ లో ఒక పెద్ద హెలికాప్టర్, ఇళ్ళు, రైల్వే ట్రాక్‌లు, భారీ తుపాకులు, ట్యాంకర్లను సైతం ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ సెట్ ను చూస్తుంటే సినిమా గ్రాండియర్ గా ఉండబోతుంది అని స్పష్టం అవుతుంది.
అన్నట్టు ఈ సినిమా షూటింగ్ ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిరాటంకంగా జరుగుతోందట. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 వేసవిలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు.