రవితేజతో ప్రియాంక అరుల్ మోహన్ ఫిక్స్ ?

Published on Jan 26, 2021 1:00 am IST

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ కలయికలో రానున్న సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తోంది. ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా ప్రియాంక అరుల్ మోహన్ కనిపించబోతుంది. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందట.

ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. పైగా త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే. అదేవిధంగా రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవితేజ తన కామెడీతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సంబంధిత సమాచారం :

More