‘రౌడీ జనార్దన’ ఎంట్రీ కోసం సన్నాహాలు

‘రౌడీ జనార్దన’ ఎంట్రీ కోసం సన్నాహాలు

Published on Jan 5, 2026 7:02 AM IST

Rowdy-Janardhana

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కించనున్న సినిమా ‘రౌడీ జనార్దన’(Rowdy Janardhana). ఐతే, ఇప్పుడు ఈ సినిమా పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో విజయ్ దేవరకొండ గెటప్ చాలా క్లాసీగా ఉండబోతుందట. సినిమాలో వైల్డ్ అండ్ క్లాస్ లుక్స్ లో విజయ్ కనిపించబోతున్నారు. ఓ సగటు మనిషి ఓ రౌడీగా మారే క్రమంలో వచ్చే సీన్స్ ను ఈ సెట్ లో తీస్తారని తెలుస్తోంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయట. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కూడా ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు