“సర్కారు వారి పాట” షూట్ పై న్యూ అప్డేట్.!

Published on Jul 13, 2021 8:01 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ సాలిడ్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట” మళ్ళీ ఎట్టకేలకు షురూ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కొత్త షెడ్యూల్ నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. మొత్తం చిత్ర యూనిట్ కి మళ్ళీ కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ రావడంతో సూపర్ ఎనర్జీతో మేకర్స్ ఈ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసేసారు.

అయితే ఈ షెడ్యూల్ పై మరింత సమాచారం తెలుస్తుంది. ఈ షెడ్యూల్ స్టార్ట్ కావడమే ఓ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అయ్యిందట. అలాగే ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ ఇంకా పాల్గొనలేదని తెలుస్తుంది. కానీ కొన్ని రోజుల్లో యాడ్ అవ్వనున్నట్టు సమాచారం. అందులో మహేష్ కీర్తీ పై మంచి ట్రాక్స్ షూట్ చేయనున్నారట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :