సవ్యసాచి ఆడియో అప్డేట్ !

Published on Sep 25, 2018 7:00 am IST

ఇటీవల ‘శైలజారెడ్డి అల్లుడు’గా ప్రేక్షుకుల ముందుకు వచ్చి కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ఇప్ప్పుడు తాజాగా ఆయన నటించిన మరో చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ‘ప్రేమమ్’ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో చైతు నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇటీవల ఈచిత్ర షూటింగ్ హైద్రాబాద్లో ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం నవంబర్ 2న ప్రేక్షకులముందుకు రానుంది.

ఇక ఈచిత్రం యొక్క ఆడియో విడుదల వేడుకను వచ్చే నెలలో దసరా సీజన్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారట. ఈచిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో చైతు సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

సంబంధిత సమాచారం :