‘పుష్ప’ స్మగ్లింగ్ సీన్స్ షూటింగ్ అక్కడే !

Published on Jul 5, 2020 11:36 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. కాగా ఆగ‌స్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో స్మగ్లింగ్ సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక మిగతా సీన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ నిర్మిస్తారట.

అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో స్టార్ట్ చేస్తారట. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసిందట చిత్రబృందం. అలాగే తమిళ హీరో విజయ్‌ సేతుపతి కూడా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More