పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ఐతే, తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్ లో స్పెషల్ విఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారట. సో.. స్పిరిట్ క్లైమాక్స్ విజువల్ ఎక్స్ పీరియన్స్ ఓ లెవెల్లో ఉండబోతుందట. మొత్తానికి ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ అత్యుత్తమంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ పోలీస్ యాక్షన్ డ్రామాలా కాకుండా, వైల్డ్ నేచర్ ఉన్న ఓ మాజీ పోలీస్ పతనం – పోరాటం చుట్టూ నడిచే డార్క్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది.
ముఖ్యంగా ‘పోలీస్ వర్సెస్ క్రిమినల్స్’ కంటే, ఒక వ్యక్తి తనను తాను ఎలా తిరిగి నిలబెట్టుకున్నాడనే క్యారెక్టర్ డ్రామా కొత్త కోణంలో సాగుతుందట. కాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. మొత్తానికి ‘స్పిరిట్’ పై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.


