సందీప్ కిషన్, తమన్నా, నవదీప్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ తెరకెక్కించిన ఈ చిత్రానికి లియాన్ జోన్స్ సంగీతం అందించారు.
కాగా తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం హైదరాబాద్ లోని మాదాపూర్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ అంత లండన్ లో జరిగింది. అక్కడి విజువల్స్ ఈ చిత్రంలో హైలైట్ అవ్వనున్నాయి. అక్షయ్ పూరి, రైనా జోషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక గతకొంత కాలంగా తెలుగులో సరైన హిట్టు లేని సందీప్ కిషన్ ఈ చిత్రం ఎలాగైనా విజయాన్ని అందిస్తుందని ధీమాగా ఉన్నాడు.


