ఎన్ జి కె టీజర్ రన్ టైం లాక్ !

Published on Feb 13, 2019 9:45 am IST

కోలీవుడ్ లో ప్రస్తుతం ఎన్ జి కె టీజర్ హాట్ టాపిక్ అవుతుంది. ఈ టీజర్ విడుదలకోసం సూర్య అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఈనెల 14న సాయంత్రం 6 గంటలకు సూర్య చేతులమీదగా ఈ విడుదలకానున్న ఈ టీజర్ ను తమిళనాడు లో చాలా థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇక ఈ టీజర్ యూ సర్టిఫికెట్ తో 66 సెకండ్ల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది.

విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్నఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని తమిళం తోపాటు తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :