“వీరమల్లు” పై మరిన్ని అంచనాలు పెంచిన నిధి కామెంట్స్.!

Published on Aug 8, 2021 2:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్ లలో భారీ అంచనాలతో ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమా మాత్రం “హరిహర వీరమల్లు” సినిమానే అని చెప్పాలి. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ హిస్టారికల్ పాన్ ఇండియన్ చిత్రం మిగిలి ఉన్న బ్యాలన్స్ షూట్ కి రెడీ కానుంది.

అయితే ఈ చిత్రం లో పవన్ సరసన మొట్టమొదటి సరిగా హీరోయిన్ గా నటిస్తున్న హాట్ అండ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఈము ట్విట్టర్ స్పేస్ లో ఈ విషయం చెప్పింది.

దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు సినిమాని మైండ్ బ్లోయింగ్ గా తెరకెక్కిస్తున్నారని ప్రతీ ఒక్క పని కూడా చాలా నైస్ గా వర్కౌట్ చేస్తున్నారని తెలిపింది. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న పవన్ అభిమానుల్లో మరింత కాన్ఫిడెంట్ పెరిగింది. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :