ఉమెన్స్ డే సందర్భంగా ‘పంచమి’ స్పెషల్ విషెస్

ఉమెన్స్ డే సందర్భంగా ‘పంచమి’ స్పెషల్ విషెస్

Published on Mar 8, 2025 7:00 PM IST

hhvm tel

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిదశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాకు కేవలం కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూస్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాకు కీలకంగా ఉంటుందని.. ఈ పాత్రలో నిధి అగర్వాల్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకతను పురస్కరించుకుని నిధి అగర్వాల్ తాజాగా ఓ వీడియో బైట్ రిలీజ్ చేసింది.

పంచమి అనే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అని.. ఆమె చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని.. చాలా బలమైన, ధైర్యవంతురాలిగా పంచమి ఆకట్టుకుంటుందని నిధి అగర్వాల్ తెలిపింది. పంచమి లాగా ఈ ప్రపంచంలో తమ సత్తా చాటుతున్న మహిళలందరికీ వుమెన్స్ డే విషెస్ అంటూ నిధి అగర్వాల్ ఈ వీడియో బైట్‌లో పేర్కొంది. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు