స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్ !

స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్ !

Published on May 22, 2019 3:20 PM IST

దక్షిణాదిన అడుగు పెట్టీ పెట్టగానే నాగ చైతన్య, అఖిల్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి వార్తల్లో నిలిచిన హీరోయిన్ నిధి అగర్వాల్. ‘సవ్యసాచి, మిస్టర్ మజ్ను’ చిత్రాలు భారీ సక్సెస్ ఇవ్వకపోయినా పరిశ్రమలో ఆమెను అందరికీ తెలిసేలా చేశాయి. దీంతో ఈ బెంగుళూరు భామకు అవకాశాలు తగ్గలేదు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న ‘ఐస్మార్ట్ శంకర్’ సినిమాలో నటిస్తున్న నిధికి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. తమిళ స్టార్ హీరో జయం రవి చేస్తున్న కొత్త చిత్రంలో కథానాయికగా నిధిని ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు. ఇది జయం రవి యొక్క సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ‘భోగన్’ ఫేమ్ లక్ష్మణ్ డైరెక్షన్లో రూపొందునున్న ఈ చిత్రాన్ని హోమ్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు