ఇంటర్వ్యూ : నిధి అగర్వాల్ – ‘సవ్యసాచి’ తెలుగులో నాకు గ్రాండ్ ఎంట్రీ అవుతుంది !

Published on Oct 26, 2018 1:30 pm IST

యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది కన్నడబ్యూటీ నిధి అగర్వాల్. ఈచిత్రం నవంబర్ 2న విడుదలవుతున్న సందర్భంగా నిధి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం ..

మీ గురుంచి ?

మా పేరెంట్స్ నేటివ్ ప్లేస్ బెంగుళూరు. కానీ నేను పుట్టింది మాత్రం హైద్రాబాద్ లోనే. దాంతో నేను చిన్నప్పటినుంచీ కన్నడ, తెలుగు సినిమాలతో పాటు, అన్ని రకాల సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక విధంగా నేను ఇప్పుడు కన్నడ, తెలుగు, తమిళ భాషలు కొంతవరుకైన మాట్లాడ గలుగుతున్నానంటే దానికి కారణం.. నేను చూసిన సినిమాలే.

చిత్ర డైరెక్టర్ చందు మొండేటి గురించి ?

నేను హిందీలో నటించిన మున్నా మైకేల్ చిత్రం చూసి చందు సర్ నన్ను అప్ప్రోచ్ అయ్యారు. ఆయన నన్ను కలిసి స్క్రిప్ట్ చెప్పారు . స్క్రిప్ట్ వినగానే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది అలాగే నా పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ వుండడంతో ఈ చిత్రానికి ఓకే చెప్పాను. చందు సర్ నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు.

ఈచిత్రంలో మీ పాత్ర నిడివి తక్కువని విన్నాం ?

ఈసినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. అలాగే నా పాత్ర తక్కువ సేపు వున్నది అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఈ చిత్రం కోసం చాలా రోజులు షూట్ చేశాను. నా పాత్ర బాగా వచ్చిందంటే దానికి కారణం చందు సర్. ఈసినిమా షూటింగ్ సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నా.

మీ పాత్ర గురించి ?

ఈచిత్రంలో ఇండిపెండెట్ గర్ల్ పాత్రలో నటించాను. నా పాత్ర వల్ల సినిమా టర్న్ అవుతుంది. ఈ చిత్రంలో చాలా గ్రాఫిక్స్ వున్నా కూడా నా పాత్ర అలాగే భూమిక , సత్య , వెన్నెల కిశోర్ గారి పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈచిత్రం తెలుగు లో నాకు పర్ఫెక్ట్ లాంచ్ అవుతుంది అనుకుంటున్నా .

తెలుగులో నటించండం ఇదే మొదటి సారికదా ఎలా అనిపించింది ?

చాలా బాగుంది.ఇక్కడ అందరూ చాలా హెల్ప్ ఫుల్ గా వుంటారు. టెక్నిషియన్స్ దగ్గర్నుండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. అలాగే నేను చాల లక్కీ ఈసినిమాతో నేను చాలా విషయాలు నేర్చుకోగలిగాను.

చైతన్య గురించి ?

చైతన్య వెరీ టాలెంటెడ్ చాలా మంచి నటుడు. ఆయన చాలా పాజిటివ్ గా వుంటారు. ఇక ఇలాంటి డిఫ్రెంట్ కాన్సెప్ట్ వున్నా చిత్రంలో నటించడం చాలా కష్టం కానీ చైతు చాలా బాగా చేశారు.

సంబంధిత సమాచారం :