నిధి అగర్వాల్ అంత పారితోషికం అందుకుందా…?

Published on Nov 10, 2019 3:00 am IST

అన్నీ ఉన్నా ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే లక్ అనేది ఒకటి ఉండాలి. నాలుగో చిత్రానికి గానీ నిధి అగర్వాల్ కి ఆ లక్తగలలేదు. ఈ ఏడాది ఆమె నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ గా నిలిచింది. హిట్ ఐతే వచ్చింది కానీ అమ్మడుకి అవకాశాలు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. ఎట్టకేలకు మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీలో నటించే అవకాశం దక్కింది. నేడు హైదరాబాద్ లో అట్టహాసంగా ఈ మూవీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఛీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ వస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో నటిస్తున్న నిధి రెమ్యూనరేషన్ పై ఓ వార్త ప్రచారంలో ఉంది.

నిధి అగర్వాల్ ఈ చిత్రంలో నటించడానికి దాదాపు కోటి రూపాయల వరకు అందుకున్నారట. డెబ్యూ హీరో పక్కన నటించాలంటే ఆమాత్రం ఇవ్వాల్సిందే మరి. శ్రీ రామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More