మెగా డాటర్ పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి క్యాచీ టైటిల్!?

మెగా డాటర్ పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి క్యాచీ టైటిల్!?

Published on Mar 26, 2024 7:14 PM IST

మెగా కుటుంబం నుంచి వచ్చిన యువ నటీనటుల్లో మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఒకరు. మరి ఆమె నటిగా హోస్ట్ గానే కాకుండా నిర్మాతగా మారి నిర్మాణం భాద్యతలు కూడా ఆమె తీసుకోగా తన బ్యానర్ ని పింక్ ఎలిఫెంట్ సంస్థ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని ఇప్పుడు తీసుకురాబోతున్నట్టుగా టాక్ ఉంది.

శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ తో కలిసి కొత్త దర్శకుడు యాదు వంశీ ని సహా అనేక మంది యువ నటీనటుల్ని పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి ఒక ఆకర్షణీయమైన యూత్ ఫుల్ టైటిల్ ని లాక్ చేసినట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మేకర్స్ “కమిటీ కుర్రోళ్ళు” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారట. ఇది విన్నవెంటనే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి.

మరి ఈ సినిమాలో కంటెంట్ పట్ల కూడా తాము అంతా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వీ రావు, విశిక, షణ్ముకి నాగుమంత్రీ తదితరులు నటిస్తుండగా “హను మాన్” మ్యూజిక్ కి వర్క్ చేసిన వారిలో ఒకరైన అనుదీప్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు