ప్రభాస్ తో పెళ్లి పై నిహారికి క్లారిటీ..!

ప్రభాస్ తో పెళ్లి పై నిహారికి క్లారిటీ..!

Published on Apr 24, 2020 12:00 AM IST

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా పరిచయమైన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కూతురు అయిన నిహారిక 2016లో వచ్చిన ఒక మనసు అనే చిత్రంతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. నాగ శౌర్య హీరోగా సెన్సిబుల్ అండ్ ట్రాజిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఒక మనసు ఫలితం ఇవ్వలేదు. ఆ అతదుపరి చిత్రంగా తమిళ్ మూవీ చేశారు. సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన హ్యాపీ వెడ్డింగ్, ఆమె సోలోగా చేసిన సూర్యకాంతం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక గత ఏడాది చిరంజీవి హీరోగా దర్శకుడు సురేంధర్ రెడ్డి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం సైరా లో ఓ గెస్ట్ రోల్ చేసింది.

ఈ మధ్య తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిపెంట్స్ బ్యానర్ లో మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. కాగా ఈమె తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ చాట్ చేయగా ప్రభాస్ తో అప్పట్లో పెళ్లి అన్నారు, నిజమేనా అడుగగా, అందులో ఎటువంటి నిజం లేదని తేల్చి పారేశారు. ప్రభాస్ తో ప్రేమ, పెళ్లి అని వచ్చిన వార్తలో నిజం లేదని కొట్టి పారేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు