మెగా డాటర్ మరో మారు…, ఈసారైనా ఫలిస్తుందా…!

Published on Sep 23, 2019 2:37 pm IST

మెగా ఫ్యామిలీ నుండి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. మెగా బ్రదర్స్ లో రెండవవాడైన నాగబాబు కుమార్తె అయిన నిహారిక, నాగ శౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి చిత్రంలో =నే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆతరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాలలో నటించారు. సైరా చిత్రంలో కూడా నిహారిక తక్కువ నిడివిగల ఓ పాత్ర చేస్తున్నారు.

కాగా నిహారిక నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ నిర్మించనున్నారు. పింక్ ఎలిపెంట్స్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కి మ్యాడ్ హౌస్ అనే టైటిల్ ప్రకటించారు. దీనికి సంబందించిన ప్రోమోని నిన్న యూట్యూబ్ లో విడుదల చేశారు. 100ఎపిసోడ్స్ గా ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ కామెడీ రొమాంటిక్ జోనర్లో రానుంది. సంతోష్ , కృతి సింగ్ ప్రధానపాత్రలలో కనిపిస్తుండగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కనుంది. గతంలో నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ నిర్మించి, నటించారు. ఐతే ఈ వెబ్ సిరీస్ అంతగా ప్రాచుర్యం పొందలేదు. మరి మ్యాడ్ హౌస్ ఐనా ఆమెకు లాభాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More