మెగాస్టార్ ‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్ !

మెగాస్టార్ ‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్ !

Published on Apr 25, 2020 2:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమాలో మెగా వారసురాలు నీహారిక కొణిదెల కూడా ఓ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సినిమాలో నిహారిక, రామ్ చరణ్ కు చెల్లెలు పాత్రలో నటించబోతుందట. నిహారిక కనిపించేది నాలుగు సీన్సే అయినా.. ఆ సీన్స్ లో సిస్టర్ సెంటిమెంట్ ను బాగా ఎలివేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత మొదలయ్యే షూట్ లో నిహారిక పాల్గొననుంది. అయితే, మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు