తమిళ పరిశ్రమలో అడుగుపెడుతున్న మెగా డాటర్ !
Published on Feb 16, 2017 9:22 am IST


మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల తన మొదటి సినిమా ‘ఒక మనసు’తో గొప్ప విజయాన్ని సాధించకపోనప్పటికీ నటిగా మాత్రం మంచి మార్కులే తెచ్చుకుంది. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని కెరీర్ గురించి బాగా ఆలోచించిన ఈమె మరో మెట్టు పైకెక్కుతూ తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం తమిళ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్ సేతుపతి చేస్తున్న కొత్త చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అరుముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ మొదలైందని, నిహారిక కూడా షూట్లో పాల్గొంటోందని వినికిడి. అలాగే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో మణిరత్నం ‘కడలి’ ఫేమ్ గౌతమ్ కార్తిక్ కూడా నటిస్తున్నాడు. ఇకపోతే నిహారిక ప్రస్తుతం తెలుగులో ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.

 
Like us on Facebook