తన నాలుగు సినిమాలు సప్రైజ్ చేస్తాయంటున్న నిఖిల్

Published on Dec 9, 2019 7:29 pm IST

ఇటీవలే ‘అర్జున్ సురవరం’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు హీరో నిఖిల్. ఈ చిత్రం ఆలస్యంగా వచ్చినా ఆశించిన విజయాన్ని అందించింది. అంతేకాదు నిఖిల్ స్టోరీ సెలెక్షన్ మీద జనానికి మంచి నమ్మకం ఏర్పడేలా చేసింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమాల కథలు కూడా భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాడు నిఖిల్.

తన నుండి రాబోయే తర్వాతి నాలుగు సినిమాలు మిమ్మల్ని తప్పకుండా సప్రైజ్ చేస్తాయని ప్రేక్షకులకు, అభిమానులకు ధీమాగా చెప్తున్నాడు. ప్రస్తుతం అయన తన సూపర్ హిట్ మూవీ ‘కార్తికేయ’కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ సంస్థలతో కలిసి ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు వచ్చే యేడాదిలోనే విడుదలకానున్నాయి. మరి నిఖిల్ అంత నమ్మకంగా సప్రైజ్ చేస్తాయంటున్న సినిమాలు ఎలా ఉంటాయో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More