కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమార్ ‘జాగ్వార్’ అనే చిత్రంతో శాండల్ వుడ్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఈచిత్రం తెలుగులోను విడుదలైయింది కానీ రెండు చోట్ల నిరాశపరించింది. బాలకృష్ణ తో ‘మిత్రుడు’ సినిమాను తెరకెక్కించిన మహాదేవ్ ఈచిత్రానికి దర్శకుడు.
ఇక తాజాగా నిఖిల్ రెండవ చిత్రంతో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన ‘సీతారామ కళ్యాణ’ వచ్చే ఏడాది జనవరి 25న విడుదలకానుంది. శాండల్వుడ్ లో ఈచిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి. హర్ష తెరకెక్కించిన ఈ చిత్రం లో శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించారు.
ఈ సినిమాతో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కన్నడలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అనితా కుమార స్వామి ఈచిత్రాన్ని నిర్మించారు.


