యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకూ ఈ నెల 29న విడుదలకు సిద్దమైంది. అయితే సినిమా పై అంచనాలు పెంచటానికి ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. వాటిలో భాగంగానే రేపు హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో జరగబోయే ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యేలా చూసుకుంది చిత్రబృందం. దీనికి తోడు నిఖిల్ కూడా సినిమా కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. మొత్తానికి బాగానే ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. నిఖిల్ మాత్రం ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి హిట్ అందుకుంటాడేమో చూడాలి.


