యువకధానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో అందరూ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్న ఈ చిత్ర టీం ఈ సినిమా మంచి విజయం సాధించాలని పళని కార్తికేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
పూజ తర్వాత ‘నేను, డైరెక్టర్ చందు కలిసి పూజలు పళని కార్తికేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నాం. ఇప్పుడు రిలీజ్ కి సిద్దమని’ నిఖిల్ ట్వీట్ చేసాడు. ఆంధ్ర – తమిళనాడు బార్డర్లో ఒక టెంపుల్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ కథలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.
ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకుంది.


