అదిరిపోయే రేటుకు “కార్తికేయ 2” రైట్స్..!

Published on Sep 4, 2021 1:41 am IST


యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానల్ దక్కించుకుందని, అలాగే ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయని తెలుస్తుంది.

అయితే శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ మొత్తం కలిపి రూ.20 కోట్ల డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. కార్తికేయ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా నమ్మకం ఉంచి అప్పుడే అడ్వాన్స్ కూడా ముట్టచెప్పినట్టు టాక్. నిఖిల్ చిత్రానికి ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఇదేకాకుండా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ని కూడా భారీ ధరకు అమ్మాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :