‘స్వామి రా రా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన తాజా సినిమా ‘కార్తికేయ’. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. నిర్మాణంతర కార్యక్రమాలను ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆడియోతో పాటు విడుదలైన ‘కార్తికేయ’ ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని కలిగించింది.
సినిమాలో నిఖిల్, స్వాతి మెడికల్ కాలేజీ విద్యార్ధులుగా నటించారు. సుబ్రమణ్యస్వామి గుడి నేపధ్యంలో సినిమా సాగుతుంది. థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ బ్యానర్ ద్వారా వెంకట్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో సినిమాను విడుదల చేయనున్నారు.
