ముద్ర విడుదల తేదీ ఖరారు !

Published on Aug 10, 2018 11:50 am IST

యువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ముద్ర’. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ఖరారు అయ్యింది. సెప్టెంబర్ నెలలో షూటింగ్ ను పూర్తి చేసి సినిమాని నవంబర్ 8న విడుదల చేయనున్నారు. నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో విజయం సాధించిన ‘కనితన్’ సినిమాకి రీమేక్ గా తెరెకెక్కుతుంది . ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన టి.ఎన్ సంతోషే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈచిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ యువ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ‘కిర్రాక్ పార్టీ’ చిత్రం తరువాత నిఖిల్ మరో రీమేక్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More