నిఖిల్ సినిమా “18 పేజెస్” కూడా డైరెక్ట్ ఓటిటి యేనా?

Published on Jul 1, 2021 3:48 pm IST

తెలుగు సినీ పరిశ్రమ లో సినిమాల విడుదలలు కొన్ని వాయిదా పడుతూ ఉండగా, మరికొన్ని మాత్రం డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా విడుదల అవుతున్నాయి. అయితే డైరెక్ట్ ఓటిటి గా నిఖిల్ సినిమా అయిన 18 పేజెస్ విడుదల కి సిద్దం గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆన్లైన్ ద్వారా విడుదల కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి కథ సుకుమార్ అందిస్తుండగా పల్నాటి సూర్య ప్రతాప్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో నిఖిల్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ మొదటిసారిగా కలిసి నటిస్తోంది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం విడుదల పై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం :