పెట్రోల్, డీజిల్ ధరల పై నిఖిల్ సిద్ధార్థ ట్వీట్!

Published on Jul 12, 2021 5:21 pm IST


భారత్ లో ఊహించని రీతిలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అయితే లీటర్ పెట్రోల్/డీజిల్ 35 రూపాయలు ఉండే ధర ఎందుకు వంద రూపాయలు అవుతుంది అంటూ ప్రముఖ టాలివుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ చెప్పుకొచ్చారు. అయితే ఇంధనం ధరల పై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ధరల తో బాధపడుతున్న ప్రతి ఒక్కరి తరపున అభ్యర్థన అంటూ నిఖిల్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అంతేకాక పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి అన్నట్లు గా ఒక ఫోటో ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు నిఖిల్ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పై పలు రకాలుగా స్పందిస్తున్నారు.

అయితే ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ 18 పేజెస్ చిత్రం లో హీరొ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో నిఖిల్ హీరొ గా నటిస్తుండగా, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడగా, దీని పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :