టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘స్వయంభు’(Swayambhu) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని పీరియాడిక్ మైథలాజికల్ డ్రామాగా దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఓ వారియర్ పాత్రలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరిలో 13గా లాక్ చేశారు మేకర్స్.
అయితే, ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో మరో వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 13న రిలీజ్ చేయడం లేదని.. ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని వేసవి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌కు చాలా టైమ్ దొరుకుతుందని వారు ఆలోచిస్తున్నారట.
కాగా, ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న అయోమయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భువన్, శ్రీకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.


