నిఖిల్ “18 పేజెస్” రన్‌టైమ్‌ లాక్డ్!

నిఖిల్ “18 పేజెస్” రన్‌టైమ్‌ లాక్డ్!

Published on Dec 19, 2022 12:00 PM IST

కార్తికేయ 2 జంట నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ మరోసారి కలిసి నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

రన్‌టైమ్ విషయానికి వస్తే, చిత్రం 2 గంటల 17 నిమిషాల నిడివితో ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై సాలిడ్ బజ్ ను క్రియేట్ చేసింది. పోసాని కృష్ణ మురళి, సరయు, అజయ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు