ఈ సారైన రిలీజ్ అవుతుందా లేక పోస్ట్ ఫోనేనా ?

Published on Oct 13, 2019 11:41 pm IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చిత్రీకరణతో పాటు అన్ని పనులు పూర్తై కొన్ని నెలలు గడిచినా విడుదలకు నోచుకోలేదు. మే, జూన్ అంటూ వాయిదాపడుతూనే వచ్చింది. ఈ వాయిదాల పర్వంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. నిఖిల్ సైతం ఈ సినిమా విషయంలో చాలా సఫర్ అయ్యాడు. ఎట్టకేలకు ఆ అడ్డంకులన్నీ తొలగి ఈ నెలలో సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటే.. ఇంకా సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించలేదు చిత్రబృందం . కనీసం వచ్చే నెలలోనైనా సినిమా రిలీజ్ అవుతుందా లేక ఎప్పటిలాగే పోస్ట్ ఫోన్ అవుతుందా ? చూడాలి.

ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. ప్రస్తుతం నిఖిల్ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More