‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ హిట్ మూవీ తప్పకచూడండి-సందీప్ కిషన్

Published on Jul 11, 2019 3:01 pm IST

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ , వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా రేపు విడుదల కానుంది.ఈ సందర్భంగా రాత్రి హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఈ సారి హిట్ మూవీ తీశానని ఖచ్చితంగా చెప్పగలను, ఇది నేను ఒక్కడినే కాదు మొత్తం టీం కష్టానికి ఫలితం ఈ చిత్రం. మనం ఎంత కష్టపడినా ఒక మంచి సినిమా తీయాలంటే అన్ని కుదరాలి. ఈ సినిమాకి అన్ని అలా కుదిరాయని చెప్పగలను. సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా చాలా టెన్షన్ పడ్డాం. అద్భుతం ఎదో జరిగినట్టు మాచిత్రానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మా సినిమాతో ఎటువంటి సంబంధం లేని వారు కొందరు ఈ సినిమాను ఆపడానికి ప్రయత్నించారు. అందుకు చాలా బాధకలిగింది అన్నారు. రేపు విడుదల అవుతున్న ‘నిను వీడని నీడను నేనే’సినిమా ఖచ్చితంగా బాగుంటుంది,అందరూ చూడంటి అంటూ ముగించారు. ఈకార్యక్రమానికి అతిధులుగా హాజరైన సుధీర్ బాబు,నిఖిల్,కార్తికేయ,విశ్వక్ సేన్ చిత్రం పై తమ అభిప్రాయాలను తెలియజేసారు.

పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రానికి, సంగీతం ఎస్.ఎస్. తమన్ అందించారు.

సంబంధిత సమాచారం :

X
More