త్రివిక్రమ్ కోసం రౌడీల పని పడుతున్న నితిన్

త్రివిక్రమ్ కోసం రౌడీల పని పడుతున్న నితిన్

Published on Oct 20, 2015 11:55 PM IST

nitin-and-trivikram
ఈ ఏడాది ‘S/O సత్యమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని మొదలు పెట్టాడు. యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని అక్టోబర్ 16న రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టారు. మరి ఈ చిత్ర టీం ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటే.. ప్రస్తుతం నితిన్ తనని రౌండప్ చేసిన రౌడీలను చితకబాదే పనిలో ఉన్నాడు.

ఫ్రెండ్స్ తో సరదాగా రోడ్ మీద వెళ్తున్న హీరో మీద సడన్ గా కొంతమంది దాడి చేసారు. అప్పుడు నితిన్ వారిని ఎలా చితక్కొట్టాడు అన్న ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని గోవా స్ట్రీట్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. రవివర్మ ఈ యాక్షన్ ఎపిసోడ్ కి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా అనిరుధ్ రవిచంద్రన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు