“మాస్ట్రో” గ్లింప్స్..సింపుల్ నుంచి ఊహించని వరకు.!

Published on Mar 30, 2021 5:00 pm IST

ఈరోజు మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ జన్మదినం సందర్భంగా ఇతర హీరోలు సహా అభిమానులు అంతా తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి అలాగే నీతి బర్త్ డే స్పెషల్ గా తా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “మాస్ట్రో” సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యడమే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ ను కూడా ఇప్పుడు విడుదల చేశారు. మరి ఇది మాత్రం ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూడని వారికి షాక్ ఇస్తుంది అని చెప్పాలి.

స్టార్టింగ్ లో జస్ట్ పియానో వాయిస్తూ ప్లెజెంట్ గా అనిపించినా మహతి సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కసారిగా హీట్ ఎక్కించింది. అలాగే ఆ సడెన్ చేంజ్ లోనే నీటిలో ముంచుతున్నట్టుగా అందుని పాత్రలో నితిన్ మరోసారి మైండ్ బ్లాక్ చేసాడు. ఆ కళ్ళతో నితిన్ ప్రయోగం మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది.

మొత్తానికి మాత్రం ఈ చిత్రం నితిన్ కెరీర్ లో తన నటన పరంగా కూడా బెస్ట్ గా నిలవనున్నట్టు అనిపిస్తుంది.బాలీవుడ్ హిట్ చిత్రం “అంధదూన్”కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ వారు వచ్చే జూన్ 11న విడుదల చెయ్యనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :