మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొనగా ఈ చిత్రం అనంతరం అయితే దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కించనున్న చిత్రం లేటెస్ట్ గా అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే.
మరి ఈ చిత్రంని పవన్ టైటిల్ “తమ్ముడు” గా అనౌన్స్ చేయడంతోనే మంచి హాట్ టాపిక్ గా నిలవగా ఈ చిత్రం షూటింగ్ సహా రిలీజ్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. మేకర్స్ ఈ మధ్యలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనుండగా వచ్చే ఏడాది వేసవి కానుకగా అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో డిసెంబర్ నుంచి మరో 6 నెలల్లోపే నితిన్ నుంచి మరో సినిమా వచ్చేస్తుంది అని చెప్పాలి.
