హిట్ కాంబో వస్తోంది చూస్కోండి అంటున్న నితిన్ !
Published on Jun 30, 2018 6:49 pm IST

రెండు వరుస పరాజయాల తర్వాత హీరో నితిన్ చేస్తున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకొద్ది రోజుల్లో ఈ చిత్రీకరణ ముగియనుంది. ఈ సినిమాపై నితిన్ చాలా నమ్మకంగా ఉన్నారు.

ఆ నమ్మకం ఎంతలా ఉందంటే ఈ చిత్రం కెరీర్ తొలినాళ్లలో దిల్ రాజుతో తాను చేసిన ‘దిల్’ అంతటి సక్సెస్ అవుతుందని, సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం ఎక్కువ భాగం ఆగష్టు నెలలో విడుదలయ్యే అవకాశలున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook