నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ తో షూట్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆఖర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
కాగా ఇటీవలే నితిన్ హీరోగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్ భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు. ఇప్పటికే స్క్రిప్ట్ విన్న నితిన్, కొన్ని మార్పులు కూడా సూచించారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన హన్సికను హీరోయిన్ గా నటిస్తోంది. గతంలోనే నితిన్ హన్సిక ‘సీతారాముల కళ్యాణం లంకలో’ అనే చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.


